SSC GD Notification 2024:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి జనరల్ డ్యూటీ (GD) 39,841 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ SSC GD Notification 2024 సంబంధించిన అర్హత,పరీక్ష విధానం, వయసు, ఎంపిక విధానం పూర్తి వివరాలను చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
SSC GD Notification 2024 Overview:
ఉద్యోగ సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ |
ఉద్యోగాలు | జనరల్ డ్యూటీ |
ఖాళీలు | 39841 |
అప్లై విధానం | Online Apply |
Start Date | 05 సెప్టెంబర్ 2024 |
End Date | 14 అక్టోబర్ 2024 |
More Jobs Visit | Freshjobstelugu.com |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు విడుదల చేయడం జరిగింది ఇందులో జనరల్ డ్యూటీ పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
పోస్టుల వివరాలు:
ఈ SSC GD Notification 2024 లో 39,841 పోస్టుల భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది వాటికి సంబంధించిన పూర్తి ఖాళీలు వివరాలు క్రింది పట్టికలో గమనించవచ్చు.
జీతం:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం ఈ విధంగా ఉంటుంది.
- NCB ఉద్యోగాల Pay Level – 1 ప్రకారం బేసిక్ పే ఈ విధంగా ఉంటుంది ( 18,000 నుండి 56,900)
- మిగిలిన అన్ని పోస్టులకు బేసిక్ పే లెవెల్ -3 ప్రకారం (21,700 నుండి 69,100)
విద్యా అర్హత:
1 జనవరి 2025 నాటికి పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు కేవలం పదవ తరగతి అర్హత చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయసు:
ఈ SSC GD Notification 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి వయసు 18 నుండి 23 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు కొందరికి వయసు మినహాయింపు క్రింది విధముగా ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- మిలిటరీ రిటైర్ అయిన వారికి మూడు సంవత్సరాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 5 సెప్టెంబర్ నుండి 14 అక్టోబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగినది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వీటికి సంబంధించిన పరీక్షలను జనవరి లేదా ఫిబ్రవరి 2025న నిర్వహిస్తామని నోటిఫికేషన్ నందు తెలియజేశారు.
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్
టెక్ మహీంద్రా సమస్యలో ఇంటి నుండి పని
అమెజాన్ catalog అనలిస్ట్ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
వీటికి సంబంధించిన ఎంపిక మొదట పరీక్ష నిర్వహిస్తారు ఆ తరువాత PET (ఫిజికల్ ఎండురన్స్ టెస్ట్) మరియు PST(ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్) వీటిల్లో ఎంపికైన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
పరీక్ష సిలబస్:
సబ్జెక్టు | ప్రశ్నలు |
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 20 |
జనరల్ నాలెడ్జ్ | 20 |
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ | 20 |
ఇంగ్లీష్/హిందీ | 20 |
Total | 80 |
- ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- నెగిటివ్ మార్కులు ఉన్నాయి 0.25 మార్కులు ఒక తప్పు ప్రశ్నకు తీసివేయడం జరుగుతుంది కావున సమాధానాలు చూసుకొని పెట్టాలి.
- ప్రశ్నాపత్రం మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది అందులో తెలుగు కూడా ఉంది కావున తెలుగులోనే మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది.
- ఈ ఉద్యోగాలకు అర్హత పదవ తరగతి కావున ప్రశ్నల సరళి ఆ విధంగానే ఉంటుంది.
PET:
ఈ SSC GD Notification 2024 కు ఫిజికల్ ఈవెంట్స్ లో కేవలం పరుగు పందెం మాత్రమే నిర్వహిస్తున్నారు అందులో మగవారికి ఐదు కిలోమీటర్లు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి ఆడవారికి 1.6 కిలోమీటర్లు 8.5 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది.
PST:
ఈ SSC GD Notification 2024 ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మగవారు 170 సెంటీమీటర్లు పొడుగు ఉండాలి ఆడవారు 157 సెంటీమీటర్లు ఉన్నవారు మాత్రమే అర్హులు అలాగే మగవారికి చెస్ట్ 80 నుండి 85 సెంటీమీటర్లు ఉండాలి.
పరీక్ష తేదీలు:
ఉద్యోగులకు సంబంధించిన పరీక్ష తేదీలను జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తామని నోటిఫికేషన్ నందు తెలియజేశారు.
APPLY విధానం:
ఈ SSC GD Notification 2024 దరఖాస్తు చేయడానికి మొదటగా మీరు SSC వెబ్సైట్ నందు OTPR క్రియేట్ చేసుకుని దానితో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లై లింకు కింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Notification PDF – Click Here
Apply Online – Click Here
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
2 thoughts on “SSC GD 39,841 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ | SSC GD Notification 2024 | Latest Govt Police Jobs”