OFMK Recruitment 2024:
తెలంగాణలోని మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో (OFMK) 86 జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, డిప్లమో టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయగలరు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్తెలంగాణలోని మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో (OFMK) వారు విడుదల చేశారు ఇందులో 86 జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, డిప్లమో టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
పోస్టుల వారీగా విద్య అర్హతలు క్రింద తెలిపిన విధంగా ఉండాలి.
- జూనియర్ మేనేజర్ -సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి
- డిప్లమా టెక్నీషియన్ -సంబంధిత విభాగంలో డిప్లమా చేసి ఉండాలి
- అసిస్టెంట్ -సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లమా చేసి ఉండాలి
- జూనియర్ అసిస్టెంట్ – ఇంటర్ లేదా డిప్లమా చేసి ఉండాలి
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ 11 నవంబర్ 2024న విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజులు దరఖాస్తు చేయుటకు సమయం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు ఈ తేదీలలో దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేసి 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
🔥Axis Bank లో భారీ నోటిఫికేషన్
వయస్సు:
ఈ OFMK పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే పోస్టులు అనుసరించి 21,000/- నుండి 30,000/- వరకు జీతం లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ లభించవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
🔥రైల్వే శాఖలో 10th అర్హత ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు అభ్యర్థులు 300/- నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించాలి. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా SBI Collect ద్వారా ఈ ఫీజు చెల్లింపు చేయాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను చూసి కింద తెలిపిన చిరునామాకు అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
దరఖాస్తు చిరునామా: ది డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ సంగారెడ్డి, తెలంగాణ, 502205
డాక్యుమెంట్స్: అప్లికేషన్ ఫారం, విద్య అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, అనుభవం కలిగిన సర్టిఫికెట్.
ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
2 thoughts on “సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | OFMK Recruitment 2024 | Junior Assistant Jobs | Latest Govt Jobs”