AP DME Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 997 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ సర్టిఫికెట్లు మెరిట్ పరిశీలించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి మీకు ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కావున పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
AP DME Recruitment 2024 Overview:
ఉద్యోగ సంస్థ | DME |
ఉద్యోగాలు | Senior Residents |
ఖాళీలు | 997 |
అప్లై విధానం | Online Apply |
Start Date | 22 August 2024 |
End Date | 27 August 2024 |
Official Website | https://dme.ap.nic.in/ |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు పనిచేయుటకు చాలా రకాల ఉద్యోగాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) వారు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు ఈ శాఖ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగినది.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం మూడు రకాల కేటగిరీలు గా ఈ పోస్టులను విభజించడం జరిగింది.
కనికల్ పోస్టులు: 425
సూపర్ స్పెషాలిటీ:93
నాన్ క్లినికల్ పోస్టులు:479
పైన తెలిపిన పోస్టులను అవసరానికి అనుగుణంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని నోటిఫికేషన్ నందు తెలపడం జరిగినది.
జీతం:
ఈ ఉద్యోగం మనకు వస్తే మొదటి నెల నుండి 70 వేల రూపాయల జీతం లభించడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతానికి కాంటాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు ఈ కాంట్రాక్ట్ అనేది ఒక సంవత్సరం కాలపరిమితి ఉండడం జరుగుతుంది.
తెలుగు లో ఇంటి నుండి పని చెయ్యాలి
రైల్వే శాఖలో 8000 ఉద్యోగాలు భర్తీ
APSRTC లో 3500 పోస్టులు అప్డేట్
విద్యార్హత:
ఈ పోస్టులకు MD/MS/DNB/MDS లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు లేదా DNB చేసిన వాళ్లు కూడా అర్హులని తెలపడం జరిగినది. ఇంకా పది రకాల విద్యార్హతలు తెలపడం జరిగింది పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ నందు చూడండి.
వయస్సు:
ఈ AP DME Recruitment 2024 పోస్టులకు 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులని తెలపడం జరిగినది.
- ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇవ్వడం జరిగింది
- బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఈ AP DME Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ఫీజు వివరాలు క్రింది విధముగా ఉన్నవి.
- ఓసి అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి
- ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కేవలం 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది
- ఈ ఫీజును కేవలం మనం ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది
APPLY విధానం:
మీరు ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయడానికి వీలు కల్పించారు దరఖాస్తు చేయి సమయంలో క్రింద తెలిపిన సర్టిఫికెట్లు కావాలి.
- SSC మార్క్స్ లిస్ట్
- విద్యారత మార్క్ లిస్ట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- నాలుగవ తరగతి నుండి పదవ తరగతి చదివిన స్టడీ సర్టిఫికెట్
- మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికెట్
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 27 ఆగస్టు 2024 చివరి తేదీ ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ PDF & APPLY:
ఈ AP DME Recruitment 2024 సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకోండి.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము