AP Data Entry Operator Jobs:
ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన Tele Manas అనే ప్రాజెక్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు డిసెంబర్ 8 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు 13 డిసెంబర్ ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులు భర్తీ చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIIMS కు సంబంధించిన టెలిమానస్ అనే ప్రాజెక్టుతో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఉద్యోగం వస్తే మంగళగిరి లో పనిచేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే డిప్లమా కంప్యూటర్ అప్లికేషన్ నందు చేసి ఉంటే దరఖాస్తు చేయడానికి అర్హులు.
🔥గ్రామీణ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు
వయస్సు:
ఈ AP Data Entry Operator Jobs మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉంటే దరఖాస్తు చేయగలరు ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
జీతం:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ప్రతినెలా జీతం 25,000/- ఇస్తారు ఎటువంటి ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి మొదట 11 నెలలకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు మీ పనితనం చూసి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.

ఎంపిక విధానం:
13 డిసెంబర్ 2024న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష లేదు.
🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్త ఉద్యోగాలు వచ్చాయి
దరఖాస్తు విధానం:
8 డిసెంబర్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయగలరు నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింకు క్రింది ఇవ్వడం జరిగింది.
Notification – Click Here
Apply Online – Click Here
ఇటువంటి AP Data Entry Operator Jobs సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “AP లో డేట ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | AP Data Entry Operator Jobs | Latest AP Govt Jobs | Fresh Jobs Telugu”