AP Anganwadi Recruitment 2024 :
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హత, Apply విధానం,ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలను వివరించడం జరిగినది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ AP Anganwadi Recruitment 2024 ను చిత్తూరు జిల్లాకు చెందిన ICDS ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేస్తున్నారు ఈ వివరాలను PD నాగ శైలజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 55 ఖాళీలు భర్తీ చేస్తున్నారు వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- అంగన్వాడీ కార్యకర్తలు – 06 ఖాళీలు
- అంగన్వాడి సహాయకురాలు – 37 ఖాళీలు
- మినీ అంగన్వాడీ కార్యకర్త – 12 ఖాళీలు
విద్యా అర్హత:
ఈ AP Anganwadi Recruitment 2024 అర్హతలు చూసుకుంటే
- ఏడవ తరగతి (అంగన్వాడి నాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త) లేదా పదవ తరగతి(అంగన్వాడి కార్యకర్త)చదివిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు.
- వివాహితులు అయ్యి ఖాళీలు ఉండే గ్రామానికి సంబంధించిన వారు అయి ఉండాలి. రోస్టర్ ను అనుసరించి ఈ ఖాళీలు భర్తీ చేస్తారు.
More Jobs:
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
కడప జిల్లా అంగన్వాడి నోటిఫికేషన్ వివరాలు
ఏపీలో 6532 ఉద్యోగాల జాబ్ మేళా నిర్వహణ
డిగ్రీ అర్హతతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ AP Anganwadi Recruitment 2024 దరఖాస్తు చేయుటకు 12 సెప్టెంబర్ నుండి 21 సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించారు. ఇంటర్వ్యూ వివరాలను ఇంకా వెల్లడించలేదు పూర్తి నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు ఇప్పుడు ప్రకటన మాత్రమే రావడం జరిగింది ఆ ప్రకటన పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోగలరు
ఇంటర్వ్యూ వేదిక: చిత్తూరు జిల్లా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిక కార్యాలయం (ICDS Office) నందు ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం:
ఈ AP Anganwadi Recruitment 2024 ఎంపిక విధానం క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
- 7 మరియు 10వ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ చూడడం జరుగుతుంది. ఆ మెరిట్ కు 50 మార్కులు కేటాయిస్తారు.
- ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ – 5 మార్కులు
- వితంతువులు అయితే -5 మార్కులు
- అభ్యర్థి అనాధ అయితే – 10 మార్కులు
- అభ్యర్థి వికలాంగులు అయితే -5 మార్కులు
- ఇంటర్వ్యూ -20 మార్కులకు
- మొత్తం 100 మార్కులకు ఎంపిక.
How to Apply AP Anganwadi Recruitment 2024:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 12 సెప్టెంబర్ నుండి 21 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగినది ఆ తేదీ లోపల క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఐసిడిఎస్ కార్యాలయం నందు లేదా నోటిఫికేషన్లు తెలిపిన చిరునామా నందు మీ అప్లికేషన్ను సమర్పించాల్సి ఉంటుంది.
Application & official Website
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.