TG MHSRB Pharmacist Jobs:
తెలంగాణలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి ఆన్లైన్ లో అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) వారు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ TG MHSRB Pharmacist Jobs ద్వారా మొత్తం 633 పోస్టులు ఇందులో భర్తీ చేస్తారు డిపార్ట్మెంట్ వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.
డిపార్ట్మెంట్ | ఖాళీలు |
మెడికల్ ఎడ్యుకేషన్ | 446 |
వైద్య విధాన పరిషత్ | 185 |
MNJ ఇన్స్టిట్యూట్ | 2 |
జీతం:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే వీటికి సంబంధించిన పేస్కేల్ 31,040 నుండి 92,050 వరకు ఉండడం జరుగుతుంది.
విద్యా అర్హత:
ఈ TG MHSRB Pharmacist Jobs విద్యా అర్హత చూసుకుంటే D. Pharmacy/ B. Pharmacy/ Pharma. D చేసిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషను నందు తెలియజేశారు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ కూడా అయి ఉండాలి.
More Jobs:
AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
IIT తిరుపతి లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయసు 46 సంవత్సరాలు 1 జూలై 2024 నాటికి ఉండాలి. వయసు చెడలింపు క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
- ఎస్సీ,ఎస్టీ, బిసి, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింద చూడవచ్చు.
- 5 అక్టోబర్ నుండి 21 అక్టోబర్ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 23 మరియు 24 అక్టోబర్ వరకు అప్లికేషన్ లో ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు.
- నవంబర్ 23న రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఎంపిక విధానం:
ఈ TG MHSRB Pharmacist Jobs ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్ష సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది పరీక్ష విధానం కింద తెలిపిన విధంగా ఉంటుంది.
పరీక్ష విధానం:
మొత్తం ఎంపిక ప్రక్రియ 100 మార్కులకు ఉంటుంది ఇందులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు మిగిలిన 20 మార్కులకు ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా అనుభవం ఉంటే వాటిని ఆధారంగా తీసుకొని మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ,ఎస్టీ, బీసీ, EWS,PWD అభ్యర్థులు మరియు తెలంగాణ నిరుద్యోగులు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి.
- మిగిలిన అందరూ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం:
ఈ TG MHSRB Pharmacist Jobs సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించి అప్లై చేసుకోవాలి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము