ITBP Recruitment 2024:
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫోర్స్ నుండి 819 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, వయస్సు, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ITBP Recruitment 2024 ను కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) వారు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 819 ఖాళీలు భర్తీ చేస్తున్నారు వాటిలో కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు చూసుకుంటే
- ఆన్ రిజర్వుడ్- 458
- ఎస్సీ- 48
- ఎస్టీ-70
- ఓ బి సి- 162
- ఈడబ్ల్యూఎస్- 81
పైన తెలిపిన 819 ఖాళీలలో పురుషులకు 697 మహిళలకు 122 ఖాళీలు ఉన్నాయి.
More Jobs:
సొంత రాష్ట్రంలో రైల్వే శాఖలో 467 ఉద్యోగాలు
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు విడుదల
ఎంపిక విధానం:
పదవ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు
- రాత పరీక్ష ఉంటుంది
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
- ధ్రువపత్రాలు పరిశీలించి ఉద్యోగం ఇస్తారు
శారీరక ప్రమాణాలు:
ఈ ITBP Recruitment 2024 ఉద్యోగం మనం సాధించాలంటే మొదటగా పురుషులు ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి మహిళలు ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి పురుషుల ఛాతీ 75 నుండి 80 సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 1 అక్టోబర్ 2024 నాటికి 18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ITBP Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే వీటికి సంబంధించిన పేస్కేల్ మొదటి నెల నుండి ఈ విధంగా ఉంటుంది 21,700 నుండి 69,100
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎస్సీ,ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 1 అక్టోబర్ వరకు సమయం ఇచ్చారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity