Vizag, Vijayawada Airport Jobs:
విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాల్లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలోని AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥APSRTC లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలు విజయవాడ మరియు విశాఖపట్నంలోని AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ వారు విడుదల చేశారు ఇందులోజూనియర్ ఆఫీసర్ -04, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-01, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-08 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
పోస్టుల వారిగ ఈ Airport Jobs విద్యా అర్హత క్రింద తెలిపిన విధంగా ఉంది.
- జూనియర్ ఆఫీసర్: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే టికెటింగ్, రిజర్వేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో 9 సంవత్సరాలు అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఏదయినా ఒక విభాగాల్లో డిప్లమా లేదా ఐటిఐ పూర్తి చేసి ఉండాలి
- యుటిలిటీ ఏజెంట్ కమ్ డ్రైవర్: పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి వ్యాలిడ్ హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
🔥TTD లో భారీగా జీతంతో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
- జూనియర్ ఆఫీసర్ పోస్టులకు గరిష్టంగా 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
- రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా యుటిలిటీ ఏజెంట్ కమ్ డ్రైవర్ పోస్టులకు గరిష్టంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
జీతం:
- జూనియర్ ఆఫీసర్ పోస్టులకు జీతం 29,760/- జీతం ఇస్తారు.
- రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 24,960/- జీతం ఇస్తారు.
- యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు 21,270/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ నిర్వహించి ఈ Airport Jobs కు ఎంపిక చేస్తారు 11 మరియు 12 నవంబర్ ఈ రెండు రోజులలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూ మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు.
🔥AP సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఇంటర్వ్యూ వేదిక: NTR college of veterinary science, opposite to Vijayawada international airport, Gannavaram, Krishna district, AP 521101
దరఖాస్తు రుసుము:
- అభ్యర్థులు 500 రూపాయలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు AI Airport Services Limited సమస్త పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసి ఇంటర్వ్యూ సమయంలో తీసుకొని వెళ్ళాలి.
- ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి Airport Jobs ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.