RRB NTPC Under Graduate Notification 2024:
రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త కేవలం ఇంటర్/ITI/డిప్లొమా అర్హతతో 3445 పోస్టుల RRB NTPC Under Graduate నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ ద్వార 21 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ RRB NTPC Undergraduate Non Technical ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి ( అండర్ గ్రాడ్యుయేట్) ఉద్యోగాలు అయిన టికెట్ క్లర్క్,అకౌంట్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్ అనే 3445 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతను క్రింద తెలియజేయడం జరిగినది.
Post | Qualification |
టికెట్ క్లర్క్ | ఇంటర్/ITI/డిప్లొమా |
జూనియర్ క్లర్క్ | ఇంటర్/ITI/డిప్లొమా |
ట్రైన్స్ క్లర్క్ | ఇంటర్/ITI/డిప్లొమా |
ఆకౌంట్ క్లర్క్ | ఇంటర్/ITI/డిప్లొమా |
జీతం:
ఈ RRB NTPC పోస్టులకు సంబంధించి కేటగిరి వారీగా జీతం వివరాలు క్రింద తెలియజేయడం జరిగినది.
Post | Salary Basic Pay |
టికెట్ క్లర్క్ | 21,700/- |
జూనియర్ క్లర్క్ | 19,900/- |
ట్రైన్స్ క్లర్క్ | 19,900/- |
ఆకౌంట్ క్లర్క్ | 19,900/- |
ఖాళీల వివరాలు:
ఈ RRB NTPC పోస్టుల వారీగా ఖాళీల వివరాలను కింద తెలియజేయడం జరిగినది.
Post | Vacancies |
టికెట్ క్లర్క్ | 2022 |
జూనియర్ క్లర్క్ | 990 |
ట్రైన్స్ క్లర్క్ | 72 |
ఆకౌంట్ క్లర్క్ | 361 |
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 21/09/2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 21/09/2024
అప్లికేషన్ చివరి తేదీ: 20/10/2024
అప్లికేషన్ లో మార్పులు: 23 అక్టోబర్ నుండి 11 నవంబర్
More Jobs:
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాలు
AP లో 639 పోస్టులకు జాబ్ మేళా నిర్వహణ
Income Tax డిపార్ట్మెంట్ లో భారీగా జాబ్స్
కెనరా బ్యాంకులో 3000 ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింద తెలిపిన విధముగా వయసు సడలింపు ఇస్తారు.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు చడలింపు ఇచ్చారు.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఇచ్చారు
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ ఆదారిత పరీక్షలు రెండు నిర్వహిస్తారు అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అకౌంట్ క్లర్క్ ఉద్యోగులకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ RRB NTPC దరఖాస్తు రుసుము వివరాలు క్రింద తెలిపిన విధముగా ఉంటాయి.
- ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఎక్స్ సర్వీస్మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులకు 250/- రూపాయలు.
- మిగిలిన అభ్యర్థులు అందరికీ 500 రూపాయలు ఫీజు ఉంటుంది.
- పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఈ ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది కావున తప్పకుండా అభ్యర్థులు పరీక్షలు రాసి మీ ఫీజు వెనక్కి తీసుకోగలరు.
ధరఖాస్తూ విధానం:
ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తులు లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
1 thought on “రైల్వే శాఖలో ఇంటర్ అర్హతతో 3445 ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Notification 2024 | RRB NTPC Jobs in Telugu”