ICFRE Recruitment 2024:
పదవ తరగతి అర్హత తో ప్రభుత్వ సంస్థ అయిన అటవీ శాఖ కు సంబంధించిన ICFRE నుండి 16 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥APSRTC లో మరో 6 జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ICFRE అటవీ శాఖ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 16 ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నికల్ అసిస్టెంట్.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥సొంత రాష్ట్రంలో గ్రంధాలయాలలో ఉద్యోగాలు
విద్యా అర్హత:
ఈ ICFRE ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి పని అనుభవం అవసరం లేదు.
జీతం:
ఇది పర్మనెంట్ ఉద్యోగాలు మీరు ఉద్యోగంలో చేరిన వెంటనే 40,000/- జీతం లభిస్తుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా మీకు లభిస్తాయి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చేయడానికి 8 నవంబర్ నుండి 30 నవంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది.
- వీటికి సంబంధించిన పరీక్షలు జనవరి 2025 న నిర్వహిస్తారు
- పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల లిస్ట్ ఫిబ్రవరి 2025 న ప్రకటిస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మార్చి నెలలో తుది ఫలితాలు విడుదల చేసి ఉద్యోగం ఇస్తారు
దరఖాస్తు రుసుము:
ఈ ICFRE పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, PWD, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు పోస్టులు అనుసరించి 250 నుండి 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥వైజాగ్, విజయవాడ ఎయిర్ పోర్టు లలో జాబ్స్ నోటిఫికేషన్ విడుదల
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 2025 న పరీక్షలు నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు ఒకటే రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఈ ICFRE నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఆన్లైన్ లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి అటవీ శాఖ ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “అటవీ శాఖలో 10th అర్హత జాబ్స్ | ICFRE Recruitment 2024 | Latest Forest Department jobs”