ECIL Recruitment 2024:
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) నుండి వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ప్రాజెక్టు అవసరాలు అనుసారం పనితనం చూసి నాలుగు సంవత్సరాల వరకు కొనసాగిస్తారు కావున అభ్యర్థులు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥తెలుగు లో కాల్స్ మాట్లాడుతూ ఇంటి నుండి పని
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) వారు విడుదల చేశారు ఇందులో భర్తీ చేసే పోస్టులు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి
- ప్రాజెక్ట్ ఇంజనీర్
- టెక్నికల్ ఆఫీసర్
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్
- అసిస్టెంట్ ఇంజనీర్
విద్యా అర్హత:
ఈ ECIL Recruitment 2024 ద్వార భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చెయ్యాలంటే బీటెక్ లేదా డిప్లొమా 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. పోస్టులను అనుసరించి కొన్ని ఉద్యోగాలకు అనుభవం అవసరం ఉంటుంది.
వయస్సు:
ఉద్యోగాల వారీగా వయస్సు వివరాలు ఈ విధంగా ఉన్నాయి
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే 33 సంవత్సరాల లోపు ఉండాలి
- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే 30 సంవత్సరాల లోపు ఉండాలి
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 25 సంవత్సరాల లోపు ఉండాలి
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది
జీతం:
ఈ ECIL Recruitment 2024 మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 25 వేల నుండి 55 వేల వరకు పోస్టుల వారీగా రావడం జరుగుతుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు పని అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ తేది వివరాలు:
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి అప్లికేషన్ ఫారం నింపిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ నాడు ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లాలి పూర్తి వివరాలను వెబ్సైట్ ద్వారా చూడగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ కూడా ఇంటర్వ్యూకు తీసుకొని వెళ్ళాలి
- పదవ తరగతి మార్క్స్ మెమో
- బీటెక్ లేదా డిప్లమా మార్క్స్ మెమో
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు విధానం:
పూర్తి నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “ECIL లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | ECIL Recruitment 2024 | Latest Govt Jobs Telugu | Job Alerts Telugu ”