APSRTC Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో ఖాళీగా ఉన్న అప్రెంటిషిప్ కు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు 31 అక్టోబర్ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ నందు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, మరియు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వివిధ ట్రేడ్ల కు సంబంధించి ఖాళీలు ఉన్నాయి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
జిల్లా వారీగా ఖాళీల వివరాలు:
ఈ APSRTC నోటిఫికేషన్ నందు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి.
- అనకాపల్లి జిల్లా నందు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్ల నందు ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
- విశాఖపట్నం జిల్లా నందు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్ ఖాళీలు ఉన్నాయి.
- విజయనగరం జిల్లా నందు మిషనిస్ట్ సంబంధించి ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
- పార్వతీపురం మన్యం జిల్లా నందు డీజిల్ మెకానిక్ సంబంధించి ఖాళీలు ఉన్నాయి.
- శ్రీకాకుళం జిల్లా నందు డీజిల్ మెకానిక్ ట్రేడ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
- తూర్పుగోదావరి జిల్లా నందు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్ లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు
- బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ సంబంధించిన ట్రేడ్ల అప్రెంటిషిప్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత & వయస్సు:
APSRTC లో విడుదలైన ఈ పోస్టులకు సంబంధిత ట్రేడ్ నందు ITI పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబంధించి మీరు https://apprenticeshipindia.gov.in/ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత నవంబర్ 6వ తేదీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 7న పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు నవంబర్ 8న కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
🔥ఆంధ్ర బ్యాంకులో సొంత రాష్ట్రంలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉదయం 10 నుండి విజయనగరంలోని వీటి అగ్రహారం లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీ నందు హాజరు కావాలి అక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఖాళీలు ఉన్న జిల్లాలకు మిమ్మల్ని ట్రైనింగ్ కొరకు పంపించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే ఈ ట్రైనింగ్ కాలేజీ నందు సంప్రదించవచ్చు.
ధరఖాస్తూ చేసే విధానం:
ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉంటే దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు అవ్వండి.
ఇటువంటి APSRTC ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “APSRTC లో ఖాళీలు భర్తీ | APSRTC Recruitment 2024 | APSRTC Notification 2024 | Latest APSRTC Jobs”