APPSC Group 2 Mains Exam Latest News:
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఈనెల 23 న జరగనుంది దానిని నిలుపుదల చేయాలని హైకోర్టుకు కొంతమంది అభ్యర్థులు వెళ్లడం జరిగింది హైకోర్టు నిలుపుదల చేయడానికి నిరాకరించింది. పూర్తి వివరాలు పరిశీలిస్తే రోస్టర్ విధానంలో GO 77 ను అమలు చేయకుండా మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులకు పాయింట్లు ఇచ్చారని నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన రోస్టర్ పాయింట్ తప్పులు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీర్పు హైకోర్టు వారు వెల్లడించారు.
ఇటువంటి APPSC Group 2 సమాచారం రోజు మీ WhatsApp లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ సంస్థలో DEO ఉద్యోగాలు భర్తీ
Appsc Group 2 Court Case:
అభ్యర్థులు ఈ పరీక్షను వాయిదా వేసి రోస్టర్ పాయింట్ సరి చేసిన తర్వాత పరీక్ష నిర్వహించాలని కోరడం జరిగింది. హైకోర్టు దీనిని నిరాకరించింది పరీక్షను నిలిపి వేస్తే అర్హులైన అభ్యర్థులు ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆధారంగా జరిగే తదుపరి చర్యలని తుది తీర్పు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారు హారిజంటల్ రోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు ఆశ్రయించిన వారిలో ప్రధాన పరీక్షకు అర్హులు కేవలం ఇద్దరే. మెయిన్స్ పరీక్ష ఆపేస్తే అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుందని ఈ నేపథ్యంలో పరీక్షను నిలిపి వేసేందుకు నిరాకరిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన వ్యాజ్యం పై విచారణ మార్చ్ 11 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
🔥AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు
APPSC GROUP 2 Aspirants:
హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారు పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తాం అందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేసాం పరీక్ష జరిగే 175 కేంద్రాల్లో 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు ఆందోళన తీవ్రతరం చేయడం జరిగింది ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు అభ్యర్థుల ఆందోళన పరిశీలిస్తే వారు కోరుకుంటున్నది రోస్టర్ సరిచేసి పరీక్ష నిర్వహించండి ఇది మాత్రమే వారు కోరుకుంటున్నారు పరీక్షలు రద్దు చేయమని ఎక్కడ వారు కోరుకోవట్లేదు కావున ప్రభుత్వం వారు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు అభ్యర్థులు న్యాయం కోసం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనున్నారు ఎటువంటి తదుపరి సమాచారం తెలిసిన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది క్రింద లింక్ ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి.
ఇటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.