AP Social Media Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పేషీల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇందులో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వారు నియామకాలు పూర్తి చేస్తారు వీడికి సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, పూర్తి వివరాలను చూసి దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC) వారు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వం ఈ ఉద్యోగాలు భర్తీ కొరకు గత నెలలో జరిగిన క్యాబినెట్ లో ఆమోదం తెలిపిన విషయం మనకు తెలిసిందే అందులో భాగంగా ఈ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ మొదలైంది.
పోస్టుల సంఖ్య:
ఇందులో మొత్తం 48 ఖాళీలు భర్తీ చేస్తున్నారు వాటి వివరాలు చూసుకుంటే.
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ – 24
- సోషల్ మీడియా అసిస్టెంట్ – 24
విద్యా అర్హత:
ఈ AP Social Media Jobs 2024 సంబంధించిన విద్యార్హత చూసుకుంటే.
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ – BTech
- సోషల్ మీడియా అసిస్టెంట్ – డిగ్రీ
More Jobs:
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో డిగ్రీ అర్హత ఉద్యోగాలు భర్తీ
AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అనుభవం: డిజిటల్ కంటెంట్ సృష్టించడం వాటి ప్రమోషన్లు చేయడం లాంటి అనుభవం ఉండాలి. ఇందులో సంబంధిత విభాగం పోర్ట్ఫోలియో కార్యకలాపాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేసే లోతైన పరిజ్ఞానం ఉండాలి.
జీతం:
ఈ AP Social Media Jobs 2024 ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన జీతం ప్రతి నెల ఈ విధంగా ఉంటుంది.
- సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ – 50,000/-
- సోషల్ మీడియా అసిస్టెంట్ – 30,000/-
ఎంపిక విధానం:
ఈ AP Social Media Jobs 2024 ఎంపిక విధానం మొదటగా మీరు రెస్యూమ్ ను పంపిన తర్వాత మీ వివరాన్ని పరిశీలించి మీరు ఈ ఉద్యోగాలకు అర్హులు అయితే మీకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మీ రెజ్యూమ్ ను ఇక్కడ తెలిపిన Email (info.apdcl@gmail.com) ఐడి కి సెప్టెంబర్ 23వ తేదీ లోపల పంపించవలసి ఉంటుంది. ఈ మెయిల్ చేసే సమయంలో ఓకే పిడిఎఫ్ లో మీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పంపాలి వాటితో పాటు సంతకం,ఫోటో, పుట్టిన తేదీ రుజువు, కమ్యూనిటీ సర్టిఫికెట్ కూడా జత చేసి మెయిల్ పంపించాలి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Yes I am more interested in this job opportunity