AP Police Jobs Update:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాల తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు చూసుకుంటే ఇప్పటికే 6100 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసి వాటికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను పూర్తి చేయడం జరిగింది అందులో 95,206 మంది ఉత్తీర్ణత సాధించారు దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ మరియు మెయిన్స్ పరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉంది కానీ కోర్టు కేసు కారణంగా ఇవి నిర్వహించలేదు. ఈ కోర్టు కేసు గమనిస్తే హోంగార్డులకు సివిల్ మరియు AR పోస్టులలో 15% అలాగే APSP పోస్టులలో 25 శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ కారణంగా కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥 ఆంధ్రప్రదేశ్ లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ
ఈ AP Police ఉద్యోగాల పైనే చాలామంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19,999 ఖాళీలు ఉన్నట్లు RTI ద్వారా తెలిసింది ఈ పోస్టులను త్వరిగతిన భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు వాటికి సంబంధించి ఈరోజు తాజా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారకాతిరుమల రావు గారు ఒక కార్యక్రమంలో భాగంగా వెల్లడించారు ఆ వివరాలు చూసుకుంటే.
ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్రంలో 6000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత ప్రతిష్టంబన నెలకొంది న్యాయ సలహా తీసుకొని త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభించి దేహదారుధ్య, శారీరక సామర్ధ్య మరియు మెయిన్స్ పరీక్షలను 180 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
🔥రెవెన్యూ శాఖలో పదివేల ఉద్యోగాలు భర్తీ
AP Police కొత్త నోటిఫికేషన్:
ఈ నియామక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని డీజీపీ గారు తెలిపారు కావున అభ్యర్థులు ఈ పోస్టులకు సన్నద్ధం అవుతూ ఉంటే ఇతర పోస్టులతో పాటు వీటికి కూడా ప్రిపేర్ అవ్వండి త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ నోటిఫికేషన్ పూర్తి చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.
2 thoughts on “AP Police ఉద్యోగాలు భర్తీ 180 రోజుల్లో పూర్తి.. మరో కొత్త నోటిఫికేషన్ విడుదల ”