AP Outsourcing Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖలో డేట ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులను 18 నుండి 42 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత,ఎంపిక విధానం,దరఖాస్తు విధానం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్రప్రదేశ్ లో గ్రేడ్ 4 కొత్త ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ వారు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ నందు డేట ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు అన్ని కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానం లో భర్తీ చేస్తారు. ఇందులో మొత్తం 20 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 – 2 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ – 4 పోస్టులు
- డేట ఎంట్రీ ఆపరేటర్ – 4 పోస్టులు
- లాస్ట్ గ్రేడ్ సర్వీస్ – 10 పోస్టులు
🔥AP లో సెక్టరల్ ఆఫీసర్ ఉద్యోగాలు వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి
వయస్సు:
ఈ AP Outsourcing Recruitment 2024 సంబంధించి మీరు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
జీతం:
ఇందులో ఉద్యోగం మీకు వస్తే క్రింద తెలిపిన విధంగా జీతం లభిస్తుంది
- ల్యాబ్ టెక్నీషియన్ – 23,393/-
- ఫార్మసిస్ట్ – 23,393/-
- డేట ఎంట్రీ ఆపరేటర్ -18,450/-
- లాస్ట్ గ్రేడ్ సర్వీస్ -15,000/-
దరఖాస్తు ఫీజు:
ఈ AP Outsourcing Recruitment 2024 దరఖాస్తు చెయ్యాలంటే ఫీజు కింద తెలిపిన విధంగా ఉంటుంది
- OC, BC అభ్యర్థులకు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి
- SC, ST మరియు దివ్యాంగులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి
🔥గ్రామ సచివాలయం ఉద్యోగాల కీలక సమాచారం
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చెయ్యాలంటే అక్టోబర్ 17 నుండి 22 వరకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చెయ్యండి.
ఎంపిక విధానం:
ఈ AP Outsourcing Recruitment 2024 సంబంధించి ఎంపిక విధానం చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించరు కేవలం మీకు విద్యా అర్హత లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
🔥పార్ట్ టైం ఉద్యోగాలు తెలుగులో ఇంటి నుండి పని చేయాలి
ఫీజు చెల్లింపు విధానం:
పైన తెలిపిన విధంగా ఈ పోస్టులకు ఫీజు చెల్లించాలి దీన్ని ఆన్లైన్ విధానంలో కాకుండా బ్యాంకు వెళ్లి జిల్లా మెడికల్ ఆఫీసర్, కృష్ణాజిల్లా పేరు పైన డిమాండ్ డ్రాఫ్ట్(DD) తీసి అప్లికేషన్ ఫారం తో పాటు సమర్పించాలి.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి
1 thought on “AP లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Recruitment 2024 | AP Govt Jobs | AP Jobs Telugu ”