AP Grama Sachivalayam Update:
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామా వార్డు సచివాలయ నిర్వహణలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది సచివాలయాల లోని లోపాలను గుర్తించి అవసరమైన మార్పులను తీసుకురావాలనే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేక అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల బాధ్యతలు మరియు ప్రమోషన్ల పై తగిన నిర్ణయం నిర్ణయం తీసుకుంటున్నారు మరియు సచివాలయాల సంఖ్య తగ్గించే అంశాల పైన దృష్టి పెట్టారు.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్రప్రదేశ్లో సెక్టోరియల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
జనాభా అనుగుణంగా సచివాలయం:
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో 2000 జనాభా కు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు చాలా చోట్ల ఒకే గ్రామాల్లో మూడు సచివాలయాల నుండి 5 వరకు ఈ కారణంగా ఉన్నాయి కావున ఈ జనాభా సంఖ్య పెరిగే అవకాశం ఉంది అలాగే ఒకే పంచాయతీకి ఒకటే సచివాలయం ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది మిగిలిన సిబ్బందిని ఇతర శాఖలకు అప్పగించనున్నారు.
సిబ్బంది ప్రక్షాళన:
AP Grama Sachivalayam లోని సిబ్బంది ప్రక్షాళన చేయనున్నారు టెక్నికల్ సిబ్బందిని ఇతర శాఖలకు మరియు ప్రమోషన్లు వారికి సులభంగా లభించే అవకాశం ఉంది ఆ వివరాలు చూసుకుంటే.
- గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల ప్రమోషన్లు ఇస్తున్నారు ఇది దాదాపుగా పూర్తయింది.
- వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగులకు కూడా ఇప్పటికే ప్రమోషన్లు ఇచ్చారు
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులకు ఆ మండలంలోని అసిస్టెంట్ ఇంజనీర్ క్యాడర్ కల్పిస్తున్నారు వారికి కూడా ప్రమోషన్లు సులభంగా లభిస్తాయి
- హార్టికల్చర్ ఫిషరీస్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్లు ఆ శాఖ ల్లో భారీగా ఖాళీలను భర్తీ చేస్తారు
- పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 5,6 వారికి ప్రాధాన్య క్రమంలో ప్రమోషన్లు లభిస్తాయి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు
- వార్డు సచివాలయాల లోని అమెనిటీస్ మరియు ప్లానింగ్ సెక్రటరీలకు కూడా ఆ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి వారిని ఇతర శాఖలో కూడా తీసుకునే అవకాశం ఉంది
🔥ఏపీ పోలీస్ ఉద్యోగాల భర్తీ పై కీలక నిర్ణయం
నాన్ టెక్నికల్ సిబ్బంది ప్రామోషన్లు:
నాన్ టెక్నికల్ సిబ్బంది అయినా వెల్ఫేర్ అసిస్టెంట్ అడ్మిన్ సెక్రటరీలు ఎడ్యుకేషన్ సెక్రటరీలు మహిళా పోలీసులు వీరి గురించి పట్టించుకునే వారే లేరు వీరికి కూడా ఇతర శాఖలు లేదా సొంత శాఖల్లో ప్రమోషన్లు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.
క్యాటగిరి 1 పరీక్ష రాసి ఎక్కువ మార్కులు సాధించి ఒక ఇంక్రిమెంట్ అదనంగానే జీతం పొందుతున్న అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ఇందులో అన్యాయం జరుగుతోంది వీరికి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలని గత ప్రభుత్వానికి ఆ శాఖ వారు ప్రతిపాదనలు పంపించారు ఇప్పటివరకు వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మహిళా పోలీసుల గురించి హైకోర్టు నందు కేసు నడుస్తూ ఉంది అది పూర్తయ్యే వరకు వారి గురించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు.
వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు సెక్రటరీల గురుంచి ఎటువంటి సమాచారం లేదు ఎడ్యుకేషన్ సెక్రటరీ లను విద్యా శాఖలో వీలినం చెయ్యాలని వారు కోరుత్తున్నారు ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి నాన్ టెక్నికల్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంది.
🔥తెలుగు తెలిసిన వారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
పంచాయతీ వ్యవస్థ అనుసంధానం:
ప్రభుత్వం AP Grama Sachivalayam నిర్వహణలో పంచాయతీ వ్యవస్థకు అనుసంధానం చేయాలని ప్రయత్నంలో ఉంది ఈ ప్రక్షాళన ద్వారా గ్రామ సచివాలయాల సమర్థవంతమైన నిర్వహణ సాధించి మెరుగైన స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు ఈనెల 23న క్యాబినెట్ సమావేశం ఉంది అందులో వీటి పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇటువంటి AP Grama Sachivalayam సమాచారం కోసం రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి
1 thought on “AP Grama Sachivalayam: గ్రామ వార్డు సచివాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం”