AP DSC Exam Schedule:
ఆంధ్ర ప్రదేశ్ లో టెట్ ఫలితాలు మరియు DSC పరీక్ష షెడ్యూల్ గురించి అధికారిక సమాచారం రావడం జరిగింది ఇప్పటికే ఫలితాలు విడుదల చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవ్వడం జరిగింది. ఈ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్షా షెడ్యూల్ గురించి సమగ్ర సమాచారం కింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥AP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు షెడ్యూల్ విడుదల
AP TET ఫలితాలు ఆలస్యం:
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలను ఈనెల 4వ తేదీ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడుతలుగా ఈ పరీక్షలు నిర్వహించగా 3,68,661 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు దరఖాస్తు చేసిన 4,27,300 మంది అభ్యర్థుల్లో 86.28% మంది పరీక్ష రాశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో జాప్యం కారణంగా ఫలితాలు ప్రకటన 4 నవంబర్ సోమవారం రోజుకు వాయిదా పడింది.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
AP DSC నోటిఫికేషన్:
ఆంధ్ర ప్రదేశ్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులకు నవంబర్ 6వ తేది విడుదల చెయ్యడానికి విద్యా శాఖ కసరత్తు చేస్తోంది ఈ నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత నుండి నెల రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు ఇప్పటికే గత నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చెయ్యడానికి అవకాశం కల్పిస్తారు.
AP DSC పరీక్ష షెడ్యూల్:
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 3 నెలల సమయం ప్రిపరేషన్ కొరకు ఇస్తారు ఫిబ్రవరి లో ఈ పరీక్షలు నిర్వహించి మార్చ్ లో తుది ఫలితాలు విడుదల చేస్తారు ఏప్రిల్ నెలలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కౌన్సెలింగ్ నిర్వహించి 2 నెలలు ట్రైనింగ్ అనంతరం జూన్ నెలలో ఉద్యోగంలో చేరే అవకాశం ఇస్తారు.కావున అభ్యర్థులు ఈ షెడ్యూల్ అనుగుణంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “AP DSC పరీక్ష షెడ్యూల్ | AP TET ఫలితాలు ఆలస్యం | AP DSC Exam Schedule”