AP Cooperative Bank Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (APCOB) లో 25 అప్రెంటిస్ ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు 20 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ట్రైనింగ్ సమయంలో జీతం ప్రతినెల 15,000/- ఇస్తారు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥ఆంధ్రప్రదేశ్ మిషన్ శక్తి లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (APCOB) విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి ఈ పోస్టులను ప్రస్తుతం అప్రెంటిస్ విధానంలో తీసుకుంటున్నారు
- కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా – 17
- గుంటూరు జిల్లా – 07
- చిత్తూరు జిల్లా – 01
నోట్: పైన తెలిపిన జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలని నిబంధనలు లేవు అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ట్రైనింగ్ పై తెలిపిన జిల్లాల్లో ఏదైనా ఒక జిల్లాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
విద్యా అర్హత:
- ఈ AP Cooperative Bank Jobs 2024 పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ అర్హత బ్యాంకింగ్, కామర్స్, అకౌంటింగ్, ఆడిట్, అగ్రికల్చర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నందు ఏదయినా ఒక దానిలో ఉంటే సరిపోతుంది.
- తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం, రాయడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయగలరు
వయస్సు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీస వయసు 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు
- దివ్యాంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది
జీతం:
ఈ AP Cooperative Bank Jobs 2024 సంబంధించి మీరు ఎంపిక అయితే ప్రతి నెల జీతం 15,000/- ఇస్తారు. ఇందులో 10,500/- బ్యాంక్ వారు చెల్లిస్తే 4,500/- కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఎంపిక విధానం:
AP Cooperative Bank Jobs 2024 సంబందిచి రాత పరీక్ష నిర్వహించకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు మొదట మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్రెంటిస్ పోర్టల్ nats.education.gov.in లో మీ పూర్తి వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలి ఆ తర్వాత కంపెనీ వారి అప్లికేషన్ పెట్టీ దరఖాస్తు చేసుకున్న వారికి లోకల్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు మీరు మొదట కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్ పోర్టల్ లో నమోదు చేసుకున్న తర్వాత క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన బ్యాంకు చిరునామాకు పంపించాలి. ఆ విధంగా మీరు దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఎన్టీఆర్ సహకార భవన్, గవర్నర్ పేట్, విజయవాడ -520002
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి
2 thoughts on “AP సహకార బ్యాంకు నోటిఫికేషన్ | AP Cooperative Bank Jobs 2024 | APCOB Recruitment 2024 | APCOB Jobs”