PM Vidya Laxmi Scheme:
ఎలాంటి హామీ లేకుండా ప్రతిభావంతులు అయినా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి 10 లక్షల వరకు విద్యా రుణం ఇచ్చే ‘పిఎం విద్యాలక్ష్మి’ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. ఈ పథకానికి 2024-25 నుంచి 2030-31 మధ్య 3600 కోట్లు కేటాయించడానికి సమతించింది. దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) ఆధారంగా ఉన్న 860 QHEI లలో ప్రవేశాలు పొందే వారు ఎవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులే ఎలాంటి పూచికత్తు మరియు హామీ లేకుండా బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చు విద్యాసంస్థల ట్యూషన్ ఫీజు మరియు ఇతర ఖర్చులను ఈ రుణాల ద్వారా చెల్లించవచ్చు.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥రైల్వే శాఖలో 10th అర్హత తో భారీగా ఉద్యోగాలు
PM Vidya Laxmi Loan Details:
7.5 లక్షల లోపు రుణాలకు అయితే 75% వరకు క్రెడిట్ గ్యారెంటీ పొందే టందుకు వీలుంటుంది. వీటికి ముఖ్య అర్హతలు చూసుకుంటే కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి అలాగే ఇతర ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు కిందకు గాని వడ్డీ రాయితీ పథకాల కిందకు గాని రానివారికి మూడు శాతం వడ్డీ రైతు లభిస్తుంది 10 లక్షల వరకు రుణాలకు ఇది వర్తిస్తుంది.
దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్త PM Vidya Laxmi అనే పోర్టల్ ను ఏర్పాటు చేస్తోంది దీని ద్వారా విద్యార్థులు రుణం కోసం వడ్డీ రాయితీ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఉన్న విద్యార్థులకు 15 రోజుల్లోపు రుణం మంజూరు చేస్తారు ఒకవేళ తిరస్కరిస్తే ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తారు.
🔥గ్రామీణ బ్యాంకులో డిగ్రీ అర్హత తో 1000 ఉద్యోగాలు భర్తీ
యువతకు ముఖ్యంగా సాధికారత కల్పించి దేశం కోసం ఉజ్వల భవితను నిర్మించడంలో ఇది కీలక పరిణామం అని ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించారు ప్రతిభ ఉన్న విద్యార్థులు ఎవరూ కూడా విద్యకు దూరం కాకూడదు అని ఈ పథకాన్ని తీసుకొని వచ్చినట్టు నరేంద్ర మోడీ గారు వెల్లడించారు NIRF లో తొలి 100 స్థానాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం నిరుపేద ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఒక వరం లాంటిది.
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ fresjobstelugu.com సందర్శించండి